దివ్యాంగులు అన్ని రంగాల్లో నిష్ణాతులుగా రాణించాలి
— జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
బుధవారం మెదక్ పట్టణంలోమహిళా స్త్రీ శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి, వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో టీఎన్జీవోస్ భవనంలో ఏర్పాటుచేసిన దివ్వాంగుల కొరకు ఉచిత బ్యాటరీ ట్రైసైకిల్ ఎంపిక మరియు కృత్రిమ అవయవాల కొలతల శిబిరము జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ముందుగా వైద్య శిబిరాన్ని సందర్శించి దివ్యాంగుల వైకల్యానికి అనుగుణంగా వివిధ పరికరాల పంపిణీకి ముందుకు వచ్చిన అలీమ్ కో స్వచ్ఛంద సంస్థ సేవలను కొనియాడారు. దివ్యాంగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని నేనున్నానంటూ భరోసా కల్పించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా చర్య తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.అలిమ్ కో స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల వైకల్యాలు బట్టి వారికి వివిధ పరికరాలు అందించడం కొరకు ముందుకు రావడం జరిగింది అన్నారు దివ్యాంగుల వైకల్యాలను ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వారికి అనుకూలంగా పరికరాలు అందించేందుకు దరఖాస్తుల స్వీకరించడం జరిగిందని వివరించారు వినికిడి లోపం, ఆర్టిఫిషియల్ లింబ్స్, వీల్ చైర్స్ బ్యాటరీ సైకిల్స్ ఈ పరికరాల పంపిణీకి ప్రతిపాదన సిద్ధంచేసిదానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. , ఈ దివ్యాంగుల వైకల్యాల పరికరాలను శిబిరాలు జిల్లాలో రేపు రామాయంపేటలో ఎల్లుండి నర్సాపూర్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు .మానసిక లోపం కలిగిన దివ్యాంగులను గుర్తించి దానికి అనుగుణంగా చికిత్స అందిస్తామన్నారు అవసరమైన దివ్యాంగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ డాక్టర్ను ఏర్పాటు చేసుకొని ఫిజియోథెరపీ నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు గతంలో దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి ఏర్పాటు చేయడంతో పాటు, వారి ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని వీటన్నిటికీ విశేష స్పందనతో ముందుకు పోతూ దానికి అనుగుణంగానే ఈరోజు దివ్వాంగుల కొరకు ఉచిత బ్యాటరీ ట్రైసైకిల్ ఎంపిక మరియు కృత్రిమ అవయవాల కొలతల శిబిరము ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ శిబిరంలో 110 దరఖాస్తులుసమర్పించారన్నారు. దివ్యాంగులు సమాజంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, అన్ని రంగాల్లో నిష్ణాతులుగా రాణించాలని ఆకాంక్షించారు. దివ్యాంగుల పరికరాల కృత్రిమ అవయవాల కొలతల శిబిరాలను ఉపయోగించుకుని లబ్ధి పొందాలన్నారు
ఈ కార్యక్రమంలో సంబంధిత డీ డబ్ల్యూ హైమావతి,డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, ఆర్టిఫిషియల్ లింబ్ మన్ ఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆలింకో) స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రసన్నకుమార్, రాజబాబు, సురేంద్ర , గుండెసంబంధిత వైద్యులు డాక్టర్ సురేందర్, ఇతర ప్రభుత్వ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.