సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వెంపటి వెంకటేశ్వరరావు ఏకగ్రీవ ఎన్నిక
సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వెంపటి వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హుజూర్నగర్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించడం జరిగింది. ఈ నామినేషన్ల ప్రక్రియ తాజా మాజీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి శెట్టి శ్రీనివాస్ పర్యవేక్షణ లో ప్రస్తుత అధ్యక్షులు మా శెట్టి అనంతరాములు అధ్యక్షతన నామినేషన్ల ప్రక్రియ నిర్వహించగా జిల్లా అధ్యక్షులుగా ఎవరు ముందుకు రాక పోవడంతో వెంపటి వెంకటేశ్వరరావు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ఫిబ్రవరి 2 వరకు ఉండడంతో అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం మిగతా కమిటీని ఎన్నుకొని ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుపనున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన వెంపటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నా వంతుగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికకు సహకరించిన ఆర్యవైశ్య సంఘ నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు..