శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ పాఠశాలలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 

శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ పాఠశాలలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 

 

స్థానిక చివ్వెంల మండలం దురాజ్పల్లి సమీపంలో గల శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ పాఠశాల సూర్యాపేట బ్రాంచ్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు మరియు సాంసృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సూర్యాపేట స్వామి నారాయణ్ గురుకుల్ బ్రాంచ్ ఇన్చార్జి మంత్ర స్వరూప్ దాస్ స్వామీజీ , ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆనంద్ , డైరెక్టర్ హార్ధిక్ పాల్గొని గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయబృందం విద్యార్థులందరూ పాల్గొని చివరగా అందరికీ మిఠాయిలను పంచిపెట్టి కార్యక్రమం ను విజయవంతం చేయడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment