డిపాజిట్లపై అధిక వడ్డీ
డిపాజిట్ పథకం ఆవిష్కరించిన డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి
సంగారెడ్డి లోని ప్రధాన కార్యాలయంలో సహకార నీది డిపాజిట్ పథకం ఆవిష్కరించిన డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సీఈఓ శ్రీనివాస్, ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లా బ్యాంకులో డిపాజిట్ చేయండి ఇతర వాణిజ్య బ్యాంకుల కంటే అధిక వడ్డీ పొందండి ఆర్థిక అవసరం ఏదైనా ఉందంటే బ్యాంక్ ఒకటే అది డిసిసిబి బ్యాంక్ సహకార నిధి డిపాజిట్ పథకం 8 సంవత్సరాల నుండి 9 నెలల్లోనే రెట్టింపు పొందచ్చని పేర్కొన్నారు. సహకార నిధి డిపాజిట్ పథకంలో చేరండి కేవలం 8 సం॥ల తొమ్మిది నెలలలోనే డిపాజిట్ మొత్తాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం 26 జనవరి 2025 నుండి 25 ఫిబ్రవరి 2025 వరకు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం లో జెనెరల్ మేనేజర్ వెంకటేష్, మేనేజర్ సంగమేశ్వర్, పోలీస్ కృష్ణ, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.