ప్రజలంతా జాతీయ భావం పెంపొందించుకోవాలి

ప్రజలంతా జాతీయ భావం పెంపొందించుకోవాలి:

నీలం మధు ముదిరాజ్..

 

చిట్కుల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

గాంధీ, అంబేద్కర్, ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసిన నీలం..

ఎన్ ఎం ఆర్ క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేసిన నీలం మధు..

*గ్రామపంచాయతీ ఆవరణ, కుర్మ సంఘం, ఎస్సీ యువజన సంఘం,ముదిరాజ్ సంఘం,గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణ, అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద, రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొన్న నీలం..*

 

 

ప్రజలంతా జాతీయ భావం పెంపొందించుకోవాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్కుల్ లోనీ ఎన్ ఏం ఆర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామపంచాయతీతో పాటు పలు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ స్ఫూర్తితో దేశ ఐక్యతను చాటుతూ ప్రతీ ఒక్కరూ గణతంత్ర వేడుకలను జరుపుకోవాలని సూచించారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని దగ్గర చేస్తూ తెలంగాణ లో ప్రజా పాలన కొనసాగిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ లను దశల వారీగా అమలు చేస్తున్నారని తెలిపారు. జనవరి 26 సందర్భంగా రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల పథకాలని శ్రీకారం చుట్టారన్నారు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువజన సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment