కొండాపూర్ ఓయోరూమ్ లో గంజాయి దుకాణం

కొండాపూర్ ఓయోరూమ్ లో గంజాయి దుకాణం

 

పక్కా సమాచారం తో 

గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్ట్

 

శేరిలింగంపల్లి కొండాపూర్ లోనీ ఓయో రూమ్ లో గంజాయి దుకాణం పెట్టిన ఇద్దరినీ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్నవారిని కావలికి చెందిన రాజు (25) .మధ్యప్రదేశ్ కి చెందిన సంజన (18) గా గుర్తించిన పోలీస్ అధికారులు అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విల్లిద్దరూ గత కొంత కాలంగా అరకు ప్రాంతాలనుండి గంజాయిని తీసుకువచ్చి ఓయో రూమ్ లో ఉంటూ అమ్మకాలు చేస్తున్నారన్న పక్కా సమాచారం తో దాడి చేసినా అధికారులు వారి వద్ద నుండి 3.625 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని వారిపై ఎన్డీపీఎస్ ( నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్ స్టాన్స్ ) చట్టం కింద కేసు నమోదు చేశారు అయితే గత కొంత కాలంగా హైదరాబాద్ లో గంజాయి కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ వ్యాపారం వెనుక ఉన్న ముఠా సభ్యుల వివరాలు వేలికి తీసేందుకు దర్యాప్తు కొనసాగుతోందని గంజాయి సరపరా వంటి నేరాలను తీవ్రంగా నిరోధించేందుకు ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సమర్దవంతంగా పని చేస్తున్నారని నగర పౌరులు నేరాలకు సంబంధించిన సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment