సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన…. ఎస్సై మహమ్మద్ గౌస్
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట దుంపలకుంట తదితర గ్రామాలలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన స్థానిక ఎస్సై మహ్మద్ గౌస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు చాలా పెరిగిపోయాయని ఇట్టి విషయంపై ప్రజలు తెలియని వ్యక్తుల ద్వారా, కొత్త కొత్త నంబర్ల ద్వారా ఫోన్లు వస్తే ఫోను ఎత్తితే వాళ్ళు మేము బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని, మీ అబ్బాయి పై కేసు నమోదు అయిందని కావచ్చు, లేదా మీకు పెద్ద మొత్తంలో లాటరీ తగిలిందని కావచ్చు పలు రకాల అబద్ధాలు చెప్పి చదువు రానివారే టార్గెట్ గా ముఖ్యంగా వ్యవసాయదారులను, మహిళలను టార్గెట్ చేస్తూ తమ యొక్క ఓటీపీ నంబరు, బ్యాంకు ఖాతా నెంబర్ చెప్పమని ఫోన్లు చేయడం జరుగుతుందని ఇలాంటి విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే ఫోన్ కాల్ కట్ చేయాలని సైబర్ మోసాలకు సంబంధించిన నెంబరు 1930 కు కాల్ చేసి తెలుపాలని సూచించారు ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.