సి పి ఎం పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం
జిల్లా కేంద్రంలో స్థానిక పోస్ట్ ఆఫీస్ దగ్గర పార్టీ జండావిస్కకరణ సిపిఎం రాష్ట్ర 4 వ మహా సభలను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.మల్లేశం పిలుపునిచ్చారు.సి పి ఎంపార్టీ రాష్ట్ర 4 వ మహాసభల సందర్భం
గా జిల్లా కేంద్రం లో పార్టీ జండాను ఎగురవేసారి.ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. మల్లేశం
మాట్లాడుతూ జనవరి 25 నుంచి 28వరకు సంగారెడ్డి జిల్లా ,సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్న పార్టీ రాష్ట్ర 4 వ మహాసభలను జయప్రదం చేయాలని మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని ఆయన అన్నారు. నాలుగు రోజులు పాటు జరిగే మహాసభలలో గతమూడు సంవత్సరాల కాలంలో జరిగిన ప్రజా, కార్మిక, రైతు ,వ్యవసాయ కార్మికుల పోరాటాలను సమీక్షించి ఫలితాలను చర్చించి గత పోరాట అనుభవాలతో భవిష్యత్తు కర్తవ్యాలనురూపొందిస్తారనిఅన్నారు.కార్మిక ,కర్షక ,ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం కర్తవ్యాలను చర్చించి రూపొందిస్తారని అన్నారు. జనవరి 25వ తేదీన జరిగే పార్టీ రాష్ట్ర నాలుగవ మహాసభ బహిరంగ సభకు జిల్లా నుండి అత్యధికంగా కార్మికులు, కర్షకులు, ప్రజలు హాజరై మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాసభకు పొలిటి బ్యూరో సభ్యులు బృందాకారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ రాష్ట్ర నాయకులు ముఖ్యులు పాల్గొంటారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక చర్చలు జరుగుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంతోష్ నాయకులు అనిల్ షౌకత్ అలీ రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.