నకిలీ పాస్ బుక్ తో అక్రమంగా భూమి కబ్జా
సూర్యాపేట నడిబొడ్డులో కోట్లాది రూపాయలకు వల
విలేకరుల సమావేశంలో బాధితుడి గుండపనేని సుధాకర్ రావు ఆవేదన
అధికార పార్టీలో ఉంటే తాను ఏం చేసినా చెల్లుతుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వ విప్పు ఫేస్ పాస్ బుక్ తో డాక్యుమెంట్ను సృష్టించి అక్రమంగా భూమిని కబ్జా చేసి కంచె వేసి ఆక్రమించుకోబోతుండగా నిజమైన యజమాని గుండపనేని సుధాకర్ రావు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లో 232 సర్వే నెంబర్లు 50 గుంటల భూమిని తాను 1990లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. 2010లో రిటైర్డ్ ఎమ్మార్వో సుందర్ జారీ చేసిన ఫేక్ పాస్బుక్ తో అక్రమ డాక్యుమెంటేషన్ చేయించుకుని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు గా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తమ భూమి పైకి వచ్చి ఆక్రమించుకుంటు దౌర్జన్యం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు పాసుబుక్కును రద్దు చేస్తూ నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ శ్యామ్ రిజ్వే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై 2016లో ఇలాగే డాక్టర్ తమ భూమిపైకి రాగా ఆయనపై ఎఫ్ ఐ ఆర్ నమోదు అయినట్లు తెలిపారు. ప్రస్తుతం అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నానని ఎవరి భూమియిన తాను కబ్జా చేయవచ్చని దురాలోచనతో తమ భూమి పైకి వచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ప్రజా ప్రతినిధి వారం రోజులుగా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. ఈ విషయమై తమ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి పై ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. సదరు భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు మా పేర ఉన్నాయని మేము మా కుమార్తె చదువు కోసం లోన్ కూడా తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఆ భూమి తనదంటూ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం అన్యాయం దుర్మార్గం అన్నారు. అధికారంలో ఉన్నామని ఏమి చేసినా నడుస్తుందని అనుకుంటున్నారని అది సరికాదని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.