పారదర్శక రెవెన్యూ పాలనే లక్ష్యంగా జిల్లాను ప్రథమ స్థానం నిలపాలి
ధరణి పెండింగ్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పారదర్శక రెవెన్యూ పాలనే లక్ష్యంగా జిల్లాను ప్రథమ స్థానం నిలపాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తాసిల్దార్లను ఆదేశించారు.మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ పారదర్శక పాలన పైధరణి ల్యాండ్ కే సులు కోర్టు కేసులు ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు ఫారెస్ట్ భూసమస్యలు సంబంధిత అంశాలపై తాసిల్దారులతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పెండింగ్ దరఖాస్తుల్లో భాగంగా ఆర్డీవోలు తహసీల్దార్ స్థాయిలో పెండింగ్ లో ఉన్న దర ఖాస్తుల్లోని మ్యుటేషన్ పీఓబీ సక్సెషన్ కోర్టు కేసులు టీఎం 33 మాడ్యూల్స్ ల పరిష్కారంలో వేగం పెంచి సత్వరమే పూర్తిచేయాలని సూచించారు.అలాగే వాటికి సంబంధించిన రికార్డులను సరైన విధంగా పరిశీలించి ఆ ఫైల్ లను తిరిగి పంపించాలని ఆదేశించారు.అదే విధంగా ఆయా భూములకు చెంది
న సంబంధిత పత్రాలతో పాటు ఫీల్డ్ పొజిషన్ నివేదిక తప్పనిసరిగాస మర్పించాలని ఆదేశించారు.ధరణి
పెండింగ్ దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలన్నారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ డిఆర్ఓ భుజంగరావు ఆర్డీ
వోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, తూఫ్రాన్ జై చంద్ర రెడ్డి, సంబంధిత తాసిల్దార్లు పాల్గొన్నారు