ఉద్యాన ఉత్సవ్ కు తరలి వెళ్లిన రైతులు
జగదేవ్పూర్ : రాష్ట్రపతి నిలయం, బొల్లారం, సికింద్రాబాద్ నందు ఈ నెల 02 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు జరగుచున్న ఉద్యాన ఉత్సవ్ కార్యక్రమం ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మండలం నుండి ఈరోజు 30 మంది ఉద్యాన మరియు ఇతర రైతులు తరలి వెళ్లినట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు పూల మరియు ఉద్యాన పంటల ఎగ్జిబిషన్ ను తిలకించి ఉద్యాన పంటల్లో వచ్చిన అధునాతన పద్ధతులు గురించి తెలుసుకోవచ్చును అన్నారు.