సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లు వెంటనే పరిష్కరించే విదంగా CM రేవంత్ రెడ్డి గారు చర్చలకు పిలవాలిసిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ధర్నా సెంటర్ దగ్గర నేడు సమగ్ర శిక్ష ఉద్యోగులతో పాటు వారి పిల్లలు కూడా తమ నిరసనను తెలిపారు ఈ కార్యక్రమానికి సీపీఎం నారాయణపేట జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి మద్దతు పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ సిద్ధిస్తే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వ్యవస్థ ఉండదని అందరిని పర్మినెంట్ చేస్తామన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించి తెలంగాణకు 10సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.ప్రజాపాలన అంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారైన వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా పాలకులు అపహస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే సమగ్ర శిక్ష ఉద్యోగులను చర్చలకు పిలవాలి వారిని విద్యశాఖలో విలీనం చేసి వారిని తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు