కనకదుర్గ వైన్ షాపులో లైట్ బీర్లు అమ్మడం లేదని వైన్ షాప్ షెట్టర్ కిందకు వేసిన మధ్యం వినియోగదారులు.

కనకదుర్గ వైన్ షాపులో లైట్ బీర్లు అమ్మడం లేదని వైన్ షాప్ షెట్టర్ కిందకు వేసిన మధ్యం వినియోగదారులు.

 

బయ్యారం మండలంలోని జగ్గుతండ పంచాయతీ పరిధిలో కనకదుర్గ వైన్స్ షాప్ నెంబర్ 051,ఆదివారం మద్యం ప్రియులు మద్యం సేవించేందుకు వైన్ షాపుకు వెళ్లగా, వారికి కావలసిన లైట్ బీర్లు లేవు అని తెలుపడంతో మద్యం షాప్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మద్యం ప్రియులకు వైన్ షాప్ సిబ్బందికి మధ్య వివాదం జరిగింది.దీనితో మద్యం ప్రియులు కనకదుర్గ వైన్ షాపు సెట్టర్ కిందకు లాగి మద్యం ప్రియులకు కావలసిన మధ్యాన్ని వైన్ షాపులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మద్యం ప్రియులు మాట్లాడుతూ వైన్ షాపులో అన్ని రకాల మధ్యం నిలువ ఉంచకుండా వారి గోడౌన్ లలోనే స్టాక్ ఉంచుకొని స్టాక్ లేదని ఉన్న మొత్తం మధ్యం బెల్ట్ షాపులకు మధ్యం బాటిల్లకు స్టిక్కర్లు వేసి బెల్టు కు తరలిస్తున్నారని,మధ్యం స్టాక్ రూములలో బ్లాక్ చేసి వినియోగదారులకు కావలసిన మద్యాన్ని వైన్ షాప్ లో ఉంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనకదుర్గ వైన్ షాప్ వెనుక ఉన్న గోడౌన్ పరిశీలించగా అందులో అన్ని రకాల మద్యం బాటిల్స్ నిల్వ ఉండడం చూసి మద్యం ప్రియులు మరింత ఆగ్రహానికి లోనయ్యారు.స్టోర్ రూంలలో మధ్యంను వైన్ షాపుల సిండికేట్ దారులు బ్లాక్ చేసి ,ఆటోలలో మండలంలోని అన్ని బెల్టు షాపులకు తరలిస్తూ అధిక ధరలకు అమ్ముతూ క్యాష్ చేసుకుంటున్నారు. మధ్యం ప్రియుల బెల్టు షాపులకు పరోక్షంగా వెళ్లే విధంగా వినియోగదారుల జేబులను గుళ్ల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆబ్కారి శాఖ వీటిపై దృష్టి పెట్టి మధ్యం సేవించే వారికి కావలిసిన మధ్యం వైన్ షాప్ లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని లేని ఎడల స్థానిక ప్రజల సహకారంతో వైన్ సిండికేట్,మధ్యం సరఫరా చెయ్యకుండా మూసి వేసే విధంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

దీనిపై ఆప్కారి సీఐ చిరంజీవి ని వివరణ కోరగా వారు స్పందించలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment