గుర్తు తెలియనీ వ్యక్తి దారుణ హత్య

గుర్తు తెలియనీ వ్యక్తి దారుణ హత్య

 

గుర్తు తెలియనీ వ్యక్తినీ దారుణంగా హతమార్చిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ దగ్గర శనివారం అర్ధ రాత్రి సమయం లో ఓ గుర్తు తెలియని వ్యక్తి పై దుండగులు సిమెంట్ ఇటుకలతో తలపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు హత్యకు గురైన వ్యక్తి సుమారు 30 నుండి 35 సంవత్సరాలు ఉండవచ్చని ఎత్తు 5.5 అడుగులు ఉంటాడని మృతుడి ఒంటిపై నలుపు రంగు జాకెట్టు తెలుపు రంగు షర్ట్ బ్లూ జీన్స్ వేసుకొని ఉన్నాడని మృతుడి కూడి చేతిపై లవ్ గుర్తు టాట్టు ఉందని తెలిపారు ఘటన స్థలం వద్ద క్లూస్ టిం తో వివరాలు సేకరించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు అయితే మృతుడి కి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే మియాపూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment