గుండారం రిజర్వాయర్ ను మినీ ట్యాంక్ బండ్ గా మార్చండి
గుండారం గ్రామ శివారులో గల రిజర్వాయర్ ను మినీ ట్యాంక్ బండ్ గా ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తాజా మాజీ సర్పంచ్ ఆకుల ఓదెలు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఆదివారం కమాన్ పూర్ వచ్చిన సందర్భంగా సమర్పించారు. ఈ రిజర్వాయర్ నాలుగు మండలాలకు కమాన్ పూర్ రామగిరి ముత్తారం మంథని మండలాలకు సాగునీరు అందించే వర ప్రధానిగా విరజిల్లుతుంది. ఎంతో ప్రాధాన్యత గల గుండారం రిజర్వాయర్ను మినీ ట్యాంక్ బండ్ గా మారిస్తే సింగరేణి ప్రాంతమైన సెంటినరీ కాలనీ, కలవచర్ల,గుండారం, కమాన్ పూర్ జూలపల్లి, పేరా పల్లి,రొంపిగుంట తదితర గ్రామాల ప్రజలకు సేద తీర్చుకునేందుకు బాగుంటుందని గ్రామ ప్రజలు కోరుతున్నారు. దీన్ని ట్యాంక్ బండ్ గా మారిస్తే పర్యాటకులకు సైతం ఆకర్షణగా నిలుస్తుందని అలాగే ప్రక్కన గౌరిగుండం ఉండడంతో ఈ రెండు ప్రాంతాలకు ప్రజలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా సింగరేణి సంస్థ ద్వారా ఈ నిధులు కేటాయించాలని లేక పర్యాటక శాఖ ద్వారా నైనా నిధులు కేటాయించాలని అని వినతిపత్రంలో కోరారు. కాగా గ్రామ మా జి సర్పంచ్ ఆకుల ఓదెలు తోపాటు తాజా మాజీ ఉపసర్పంచ్ రాచకొండ చంద్రమౌళి, మాజీ సర్పంచులు ఆడవాళ్ళ చంద్రయ్య ,పిడుగు నరసయ్య, గుండారం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిడుగు శంకర్, ఆకుల రాజయ్య, వడ్లకొండ మల్లేష్ ,మతిన్ ఖాన్, ఎల్లయ్య కొమురయ్య, గాదేశంకరి, రాచకొండ శ్రీనివాస్, వి ఎస్ ఎస్ రాజేష్, తదితరులు సంతకాలు పెట్టి మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల ఓదెల ద్వారా అందజేయడం జరిగింది.