ప్రేమ విఫలం… యువకుని ఆత్మహత్యాయత్నం
ప్రేమ విఫలం కావడంతో మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం కౌటాల మండలం బోదంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి హత్మహత్య యత్నం చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.