జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పాల్గొన్న ఎంపీ ఆర్ఆర్ఆర్ , ఎమ్మెల్యే కూనంనేని , టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
కొత్తగూడెం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ఘనస్వాగతం పలికారు. సుజాతనగర్ లో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభం, పాల్వంచలో చేపట్టిన లింక్ రోడ్స్ శంకుస్థాపన, శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల లో రైఫిల్ షూటింగ్, చాతకొండ బేటాలియన్ బిటి రోడ్డు, శ్రీ శక్తి మహిళా క్యాంటిన్, రైల్వే స్టేషన్ రోడ్డు వెడల్పు తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో నాగా సీతారాములు పాటుగా రాష్ట్ర, జిల్లా, మండల కాంగ్రెస్,సిపిఐ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.