అభివృద్ధి,సంక్షేమానికి సమ ప్రాధాన్యత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

*అభివృద్ధి,సంక్షేమానికి సమ ప్రాధాన్యత*

 

 

*ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్*

 

 

అభివృద్ధి సంక్షేమానికి ప్రజా ప్రభుత్వంలో సమ ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. శనివారం చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో 53 లక్షల 6 వేల విలువ గల 53 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి & షాది ముబారాక్ చెక్కులను,16 లక్షల 78 వేల విలువ గల 52 ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు..వారు మాట్లాడుతూ కాంగ్రెసు ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు పోతున్నామన్నారు.. పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి రెండు లక్షల ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, మళ్లీ పది సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు..వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు సుమారు 11 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, ఎల్ వో సి లను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.. పేదవారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తితే ఎల్ఓసిలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు..ఇప్పటికే మహిళా తల్లులకు ఉచితా బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని తెలిపారు..వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు రైతులకు ఉచిత కరెంటు ప్రారంభించారని,మహిళలను లక్షాధికారులు చేయడానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేశారన్నారు. రైతులకు వడగల వాన వల్ల నష్టపోతే నష్టపరిహారంతో పాటు, పంట బీమా సౌకర్యాన్ని కల్పించామని అన్నారు.. రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయడం జరుగుతుందన్నారు.. ప్రతీ పెద వారికి మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందనీ తెలిపారు…రైతులను రాజుగా చేసే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని అందులో భాగంగా రైతులకు ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేశామన్నారు.. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ పేరిట పావలా పావల చేసారే తప్ప పూర్తిగా చేయలేదన్నారు.. ప్రజా ప్రభుత్వం లో సంవత్సరం పూర్తి కాకుండానే ఇంచుమించు 21 వేల కోట్లు మేర రైతు రుణమాఫీ చేసామన్నారు.. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో వరి దాన్యం కొనుగోలు పూర్తి చేశామని తెలిపారు.. గత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో తాలు తప్ప పేరుట రైతులను నిలువ దోచేసిందని అప్పటికి ప్రజా ప్రభుత్వంలో కొనుగోలకు తేడా స్పష్టంగా ఉందని తెలిపారు.. చందుర్తి మేడిపల్లి మండల ప్రజల చిరకాల కోరిక అయిన చందుర్తి మోత్కరావుపేట రోడ్డు నిర్మాణానికి మొదటి దశ అనుమతులను 1 సంవత్సర కాలంలోనే తీసుకువచ్చామని తెలిపారు.. ఆనాడు ప్రతిపక్షంలో కొట్లాడిన వాటిపై నేడు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నామని అన్నారు.. మోత్కరావుపేట చెందుర్తి రోడ్డు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయని బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.. ఇప్పటికే చందుర్తి మండల పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ఈజీఎస్ నిధులు మూడు కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు..రాజకీయాలకతీతంగా మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని అన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment