24వ రోజు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

24వ రోజు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

 

 

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ధర్నా సెంటర్ దగ్గర సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 24 రోజుకు చేరింది. గత 24 రోజులుగా మేము సమ్మె చేస్తున్న పట్టించుకోవడంలేదని , సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు మెరిట్ ద్వారా సెలెక్ట్ అయ్యారని కావున మమ్మల్ని రెగ్యులరైజ్ చేసే దాంట్లో ఇబ్బంది ఉండదని కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతో పనిచేస్తున్నామని అనుకుంటే దేశంలో అన్ని రాష్ట్రాలలో సమగ్ర శిక్ష అభియాన్ క్రింద ఉద్యోగులు పనిచేస్తున్నారు కానీ దేశంలోని పది రాష్ట్రాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని దాని బేస్ చేసుకొని మమ్మల్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర శిక్ష సంఘం నాయకులు సిఆర్పి శివకుమార్, పి.టి.ఐ తమ్మప్ప లు కోరారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment