108 అంబులెన్స్ వాహనంలో ప్రసవం
నారాయణపేట జిల్లా కృష్ణమండలం గుడిబల్లూరు గ్రామానికి చెందిన పార్వతమ్మ తన మూడో కాన్పు నిమిత్తం పురిటినొప్పులు బాధపడుతూ కృష్ణ 108 అంబులెన్స్ కు సమాచారం అందించింది సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి ఆ గర్భిణీ స్త్రీని మాగానూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించ క్రమంలోనే నల్ల గట్టు మారెమ్మ దగ్గర అంబులెన్స్ లోనే ఈఎంటి రాకేష్ సహాయంతోనే అంబులెన్స్ లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది తర్వాత వారిని మాగనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది . ఆస్పత్రి వైద్యులు పరిశీలించి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు సమయస్ఫూర్తితో అత్యవసర సమయంలో స్పందించిన 108 సిబ్బంది EMT రాకేష్ పైలెట్ అనిల్ కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రి వైద్యులు అభినందించారు