నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడమే చేనేత ఐక్య వేదిక లక్ష్యం

నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడమే చేనేత ఐక్య వేదిక లక్ష్యం

 

సూర్యాపేట జిల్లా కమిటీ ప్రమాణస్వీకారోత్సవంలో రాష్ట్ర అద్యక్షులు రాపోలు వీర మోహన్

 

 

రాష్ట్రంలో 40లక్షల మంది జనాభా ఉన్న పద్మశాలిలకు ప్రభుత్వ పథకాలు అందించి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఏర్పడిందని చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ అన్నారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన చేనేత ఐక్య వేదిక సూర్యాపేట జిల్లా కమిటీ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత ఆనవాళ్ళు నీర్విర్యమవుతున్నాయని నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. చేనేతలు ఎదుర్కోంటున్న సమస్యలపై ఇటీవల ముఖ్యమంత్రి, మంత్రులను కలసి విన్నవించినట్లు తెలిపారు. నేతన్నలకు భీమా, చేనేతకు చేయూతను అందరికి అందించాలని జియో ట్యాగింగ్ విధానాన్ని ఎత్తి వేయాలన్నారు. చేనేత వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకొని చేనేతల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. అన్ని పోటీల్లో పాల్గొంటూ మనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని కులపరంగా, వృత్తి పరంగా ఎదుర్కోనే ప్రతి సమస్యపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం చేనేత ఐక్య వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చిలువేరు నరసింహరావు, ప్రదాన కార్యదర్శిగా భీమనపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా యెల్లె లక్ష్మినారాయణ, ఉపాధ్యక్షులుగా జిల్లా సూర్యనారాయణ, ప్రచార కార్యదర్శిగా ముశం రమేష్లతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావు, మట్టపల్లి అన్నదానసత్రం అధ్యక్షులు చిన్నం వీరమల్లు, గుర్రం మార్కెండేయ, కడారి భిక్షం, మేడం రామకృష్ణ, పోచం సునీత, గుజ్జ తార, చెన్నూరి విజయలక్ష్మి, బెల్ల రఘు, రాపోలు వెంకటేశ్వర్లు, కొంగర నారాయణ, రావిరాల శ్రీనివాస్, చిలువేరు భిక్షం, జిల్లా లక్ష్మీనారాయణ, చిలువేరు అంజయ్య, సంగిశెట్టి గోపాల్, వనం వసంత, చలమల్ల నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version