విద్యార్థులు చదువు పై దృష్టి సారించాలి.
పేట మండల విద్యాధికారి వెంకటేశం.
పెద్ద శంకరంపేట్ విద్యార్థులు శిక్షణతో ప్రణాళికబద్ధంగా చదివి మంచి శ్రేణుల్లో ఉత్తీర్ణులు కావాలని పేట మండల విద్యాధికారి డి వెంకటేశం సూచించారు. శనివారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్ ఎస్ సి విద్యార్థులతో పరీక్షలకు హాజరయ్య తీరుపై అవగాహన కల్పించారు. మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని అందరు విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు.ప్రత్యేక తరగతులను పర్యవేక్షించిన అనంతరం వారికి అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్ధిరాములు. ఎమ్మార్సీ సిబ్బంది సంపత్ రెడ్డి. తదితరులున్నారు.