క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డా” కృష్ణ మూర్తి

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డా” కృష్ణ మూర్తి

 

క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి మాజీ ఎంపీపీ

 

 లైన్స్ క్లబ్ వట్పల్లి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి చౌరస్తాలో గలా హోప్ న్యూరో ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్. కృష్ణమూర్తి (న్యూరాలజిస్ట్) సౌజన్యంతో వట్పల్లి మండలకేంద్రం లో సీజన్1 క్రికెట్ టోర్నమెంట్ ఆస్థాన్ అప్పగారు, మండల ప్రజాప్రతినిధులతో కలిసి (ఖాజా నాయబే చిస్తీ అప్పగారి) చిత్రపటానికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి టోర్నమెంట్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ మొదటి మ్యాచ్ ప్రెస్- పోలీస్ టాస్ వేసి ఆటను ప్రారంభించారు. కాసేపు బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. మొదటి మ్యాచ్ లో పోలీస్ టీం పది ఓవర్లో 65 నిర్దేశించిన టార్గెట్ రేగోడ్ వారియర్స్( ప్రెస్) ఆరు ఓవర్లో 66 కొట్టి గెలుపొందారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు మొయినోద్దీన్, పెద్దన్న ,మాజీ ఎంపీపీ పత్రి విట్ఠల్, కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు వెంకట్ రావు, ఏఎంసి డైరెక్టర్ దిగంబర్ రావు, లైన్స్ క్లబ్ రీజియన్ మాజీ అధ్యక్షుడు కె. శంకర్, మాజీ సర్పంచ్ సంగారెడ్డి, నాయకులు కచుర్ రావు, డాక్టర్ సాగర్, మాజీ ఎంపిటిసి రాజు రామా గౌడ్ అలిమ్, సంగన్న, ఆయా మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version