ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయాలి : సిపిఐ డిమాండ్ తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ మండల సమితి

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయాలి : సిపిఐ డిమాండ్

 

తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ మండల సమితి

 

రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నాటికే ఋణమాపీ పూర్తి చేస్తామని ప్రకటించి నేటికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయక పోవడం రైతులపట్ల ప్రభుత్వానికి వున్న నిర్లక్ష్యం కు నిదర్శనం అని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రం లో సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం తాసిల్దార్ బండా కవిత కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రెండు లక్షలు పైబడి ఋణం తీసుకున్న వారు పై పైసలు వారి ఖాతాలలో బ్యాంకులలో చెల్లిస్తే వెంటనే వారి అకౌంట్ లలో రెండు లక్షలు జమ చేస్తామన్నా ప్రభుత్వ పెద్దల మాటలు ఎక్కడ అమలు కాలేదని, రైతులు బ్యాంకులలో పైసలు చెల్లించి నెలలు గడుస్తున్నా, వారి అకౌంట్లలో పైసలు జమ కాలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం దగ్గర పైసలు లేకుంటే ఎప్పుడు జమ చేస్తారో చెప్పి, రైతులను ఆదుకోవాలి తప్ప రైతులను గందరగోళం చేయటం తగదని ఆయన అన్నారు.

 

రైతు భరోసా ఎకరాకు 7500 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి నేడు 6000 రూపాయలు ఇస్తామని చెప్పటం రైతులను మోసం చేయడమేనని, ఆయన అన్నారు. వానకాలం, వేసంగి, రెండు కార్లకు కలిపి,ఎకరాకు 15000 రూపాయలు వేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కడియాల అప్పయ్య, యడ్ల అంజిరెడ్డి, చేవ వెంకన్న, కుందూరు వెంకటరెడ్డి, పోకల ఆంజనేయులు, షైక్ నబిసాహెబ్, పందిరి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version