నా ప్రజాసేవలో మీ సహకారం మరువలేనిది

నా ప్రజాసేవలో మీ సహకారం మరువలేనిది

 

వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన కౌన్సిలర్ వల్టాస్ సామ్యాజాని

 

తనతో కలసి పని చేసిన వార్డు సిబ్బందిని సన్మానించిన వైనం

 

 

 నేను ఐదేళ్లుగా వార్డుకు కౌన్సిలర్ గా ప్రజలకు చేసిన సేవలో వార్డు కు చెందిన మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య, ఇతర సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదని మీ సేవలను గౌరవించుకోవాల్సిన బాధ్యత నాదే అంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 23వ వార్డుకు చెందిన మున్సిపల్ అధికారులు, పారిశుధ్ధ్య, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, ఆర్పీలు ఇతర సిబ్బందిని ఆ వార్డు కౌన్సిలర్ వల్దాస్ సౌమ్యాజాని శుక్రవారం పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాజీవ్ నగర్ బతుకమ్మ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనతో కలసి ఐదేళ్లు పని చేసిన సిబ్బందిని సన్మానించి బట్టలు పంపిణీ చేసి వారితో కలసి మద్యాహ్న భోజనం చేసి మాట్లాడారు. నాకు ఓటు వేసి గెలిపించిన వార్డు ప్రజలందరికి ఐదేళ్ళు అందుబాటులో ఉండి పని చేశానని నాకు మున్సిపల్ అధికారులు, పారిశుద్ద్య ఇతర సిబ్బంది ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సహకరించారన్నారు. మురికి కాలువల్లో నీరు నిలిచినా, చెత్త పేరుకుపోయినా, నల్లాలు, వీధిలైట్లు రాకున్నా ఇతర ఏ సమస్య అయినా ప్రజలు నాకు చెబితే తాను ఫోన్ చేసి చెప్పిన వెంటనే సిబ్బంది స్పందించి పని చేశారని వారి సేవలను కొనియాడారు. నేను ప్రజా సేవ చేసేందుకే కౌన్సిలర్ గా పోటీ పడి గెలిచి ఐదేళ్ళు వార్డు ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా కంటికి రెప్పలా కాచుకున్నానని అన్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో వార్డులో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేశానని గుర్తు చేశారు. కౌన్సిలర్ గా నా పదవి ముగిసినా ప్రజల మద్య ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. తన ఈ ఐదేళ్ళ పదవికాలంలో సహకరించిన అధికారులకు, సిబ్బందికి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, వార్డు యువతకు, వార్డు ప్రజలకు చిన్న పెద్దలకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment