మహిళలకు రక్షణ కల్పించాలి.
దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మి
ఏఎస్పీ విక్రాంత్ కుమార్ ని కలిసిన దిశ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు
భద్రాచలం:రోజురోజుకీ మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు కృషి చేయాలని ఇంటా బయట మహిళలపై జరిగే దాడులను నివారించేందుకు నిఘా వ్యవస్థను పెంచాలని దిశ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మి కోరారు. శుక్రవారం దిశ ప్రొటెక్షన్ ఫౌండేషన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎదురవుతున్న పలు సమస్యలను ఏఎస్పీ విక్రాంత్ కుమార్ దృష్టికి వారు తీసుకువెళ్లారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు బివి రాజు ఉపాధ్యక్షురాలు కళ్యాణిల ఆదేశానుసారం మహిళల కోసం దిశ అనేక రకాల సామాజిక సేవ కార్యక్రమం నిర్వహిస్తుందని ఏఎస్పీకి తెలిపారు. అదే సందర్భంలో జిల్లా వ్యాప్తంగా గంజాయి గుడుంబా వంటి మత్తు పానీయాలకు యువత బానిసలు అవుతున్నారని ఆ మత్తులో యువతులపై మహిళలపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని వాటిని నివారించేందుకు నిఘా వ్యవస్థ పెంచాలని ఏస్పిని కోరారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ ఆదర్శవంతంగా పనిచేస్తుందని అన్నారు. తను కలిసిన దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులను ఉద్దేశించి ఏఎస్పి విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలిగిన ఏ సమయంలో వచ్చిన పోలీస్ స్టేషన్ తలుపు తెరిచి ఉంటాయని మహిళ రక్షణ కోసం 24 గంటల పాటు పోలీసు వ్యవస్థ పని చేస్తుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా సభ్యులు పాల్గొన్నారు.