అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలి

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలి

 

 సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోల్లి సత్యనారాయణ డిమాండ్

 

 

దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామ పంచాయతీ కార్యదర్శి కి వినతిపత్రం అందజేశారు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అర్హులైన పెదలంద రికీ అని సంక్షేమ పథకాలు అందరికీ అందించాలని అయిన డిమాండ్ చేశారు,ఉపాధి హామీతో సంబంధం లేకుండా వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆత్మీయ పథకం అమలు చేయాలని అన్నారు,

 సొంత ఇంటి స్థలం లేని పేదలందరికీ స్థలం ఇచ్చి డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాలి ఇప్పటికే నిర్మించిన డబల్ బెడ్రూం ఇల్లు అసంపూర్తిగా ఉన్నాయి వాటిని పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలి కోరారు,అలాగె ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ సభల్లో కొంత మంది పేర్లు లిస్ట్ విడుదల చేయటం జరుగుతుంది ఈ సందర్భంగా గుర్తు చేశారు, ఈ పేర్లు లిస్ట్ తో పాటు ఇంకా చాలామంది ప్రజలు ఇంటి స్థలం లేక ఇందిరమ్మ ఇల్లు లేక ఉన్నారా అని వారిని కూడా అధికారులు గుర్తించి ఈ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు,అలాగే ప్రభుత్వం గ్రామ సభలో నిర్వహించి హడావుడిగా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు తప్ప వారికి జవాబు దారిగా ఎటువంటి రసీదులు ఇవ్వడం లేదు దీనివలన ప్రజలలో గందరగోళం ఏర్పడింది కావున అధికారులు లబ్ధిదారులు ఇచ్చిన ప్రతి దరఖాస్తుకి అధికారులు రసీదులిచ్చి జవాబు దారి గా ఉండాలని సిపిఎం పార్టీ తురుబాక శాఖ నుండీ మేము డిమాండ్ చేస్తున్నామని హెచ్చరిక చేసారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, సిపిఎం పార్టీ తూరుబాక శాఖ కార్యదర్శి బిల్లా ముత్యాలరావు, మల్లారెడ్డి, నక్క సత్యనారాయణ, పోతురాజు, రేవతి ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment