అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

 

రేగోడ్ మండలంలోని సంగమేశ్వర తండా గ్రామ సభ లో ఎంపీడీఓ సీతారవమ్మా అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభ లో ఎలాంటి అపోహలకు తావులేకుండా లబ్దిదారులకు అర్థం అయ్యేలా నాలుగు పథకాలలో అర్హులైన వారి పేర్లు చదివి వినిపించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షుడు పిర్యా నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టతున్నా గ్రామసభలలో అర్హులైన అందరికీ పథకాలు వర్తిస్తాయని, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ భరోసా, ఆత్మీయ భరోసా పలు సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. లబ్ధిదారుల పేర్లు లిస్ట్‌లో రాకపోతే ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఎంపీడీఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ప్రత్యేక కౌంటర్ ఉంటుంది అని అక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డిలిగేట్ సభ్యుడు ఎం.కిషన్, ఏ పి ఓ జగన్ ప్రజలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment