కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తుందని 30వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాలకుర్తి వెంకటేష్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందించనున్న వివిధ సంక్షేమ పథకాల అర్హుల జాబితాను ఎంపిక చేసేందుకు గాను గురువారం 30వ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రజా పాలనలో ఎవరు ఏ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారి పేర్లను మాత్రమే వార్డు సభల్లో అధికారులు ప్రకటిస్తున్నారని తెలిపారు. జాబితాలో పేర్లు లేని వారు వారు ఏ సంక్షేమ పథకాలకు అర్హులవుతారు గుర్తించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ప్రజలు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారి మచ్చ రాంబాబు, అంగన్వాడి టీచర్లు, ఆర్పీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.