అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు.
మండల స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామసభ.
తాసిల్దార్ గ్రేసీ బాయ్.
పెద్ద శంకరంపేటలో రసభాసగా మారిన గ్రామసభ.
పెద్ద శంకరంపేట్. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని పెద్ద శంకరంపేట మండల తాసిల్దార్ గ్రేసీ బాయ్ అన్నారు. మండల కేంద్రమైన పెద్ద శంకరంపేట లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇందిరమ గృహాలు రాకపోవడంతో పలువురు తమకు ఎందుకు నూతన రేషన్ కార్డులు మంజూరు కాలేవని అధికారులను నిలదీశారు.పేట తాసిల్దార్ అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని. అర్హులైన వారందరూ ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రమేష్ పేట పంచాయతీ కార్యదర్శి వెంకటరాములు. పేట మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ .మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ. జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు భవాని. నాయకులు ఆర్ఎన్ సంతోష్ కుమార్. సుభాష్ గౌడ్.గంగారెడ్డి. బాను.విఠల్ రెడ్డి. నరసింహ చారి హరికిషన్ అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.