కుటుంబ క్షేమం కోసమైన హెల్మెట్ ధరించి వాహనం నడపండి
జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి
జాతీయరోడ్డుభద్రతామాసోత్సవాలను పురస్కరించుకొని రోడ్డు రవా
ణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీకి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరియు జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధిలుగా హజరయి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరియు జిల్లా ఎస్పి . ఉదయ్ కుమార్ రెడ్డి పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ సమీకృత కలెక్టర్ కార్యాలయం నుండి వెల్కమ్ బోర్డు మీదుగా తిరిగి చివరకు సమీకృత కలెక్టర్ భవనం వద్ద ముగింపు అయినది.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పి శ్రీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్ గారు మాట్లాడుతూ…మెదక్ జల్లాలోనే సుమారుగా ఒక సంవత్సరంలో 320 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తూన్నారు ఆని అన్నారు అంటే సుమారుగా రోజుకు ఒక్కరు చొప్పున రోడ్డు ప్రమాదం లో మరణిస్తూన్నారు అని అన్నారు. అధె విదంగా దేశం మొత్తం లో ఒక సంవత్సరంలో 1 లక్ష 50 వేల మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తునారు అని అన్నారు. రోడ్డు ప్రమాదలకు గురి ఆయీ మరణించిన వారిలో 20 నుండి 40 సంవత్సరాల వయస్సు గల వారే ఎక్కువ ఉన్నారు. ప్రతి వాహనదారుడు తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారణ లో బాగస్వామ్యం కావాలని అన్నారు. తల్లిదండ్రులు లక్షల విలువైన బైక్ ను కొనిస్తునారు కానీ తన కుమారుడి ప్రాణాని కాపాడే హెల్మెట్ ను మాత్రం దరించి డ్రైవింగ్ చేయాలనే విషయన్ని చెప్పలేకపొతున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని, ద్విచక్ర వాహన ప్రమాదాల్లో అధికంగా తలకు గాయాలు అయి వాహనదారుడు మరణిస్తున్నాడని, ప్రతి వాహన దారుడు క్షేమంగా వారి గమ్య స్థానాలకు చేరుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, తమ మీద ఆధారపడి జీవిస్తున్న మీ కుటుంటుంబ కోసమైన ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనం నడపడం అవసరమని తెలియజేసారు.
ఈ కార్యక్రమములో జిల్లా ఆధానపు కలెక్టర్ నగేష్ మరియు జిల్లా రవాణాశాఖాధికారి ఆర్. వెంకట స్వామి మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్ . సాయుదళ డిఎస్పి రంగ నాయక్ మరియు ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి , మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు మరియు ఎస్ఐ లు ఆర్ఎస్ఐ లు పాటు రోడ్డు రవాణా శాఖ, పోలీసు శాఖ చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.