“ప్రజాదర్బార్” నిర్వహణలో
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.
ఉరవకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన బాధితుల నుండి వివిధ ప్రజాసమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మంత్రి దృష్టికి పలువురు నాయకులు, ప్రజలు పలు రకాల సమస్యలను తీసుకురాగా, ఎలాంటి ఆలస్యం కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగా ఫోన్ ద్వారా ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.