అర్హులైన లబ్ధిదారులకు అన్ని పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీలో జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి స్పష్టం చేశారు. శుక్రవారం రాజంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.