అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు తప్పకుండా అందిస్తాం.
01/02/25 న పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 41648 మంది లబ్ధిదారులకు రూ.18 కోట్ల 23లక్షల 57వేల 500 పంపిణీ.
ఉదయం 6 గంటలకే పింఛన్లు పంపిణీ కి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తప్పనిసరిగా హాజరుకండి
పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
అర్హులైన పేదలందరికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు దశలవారీగా అందిస్తామని పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ లో భాగంగా శనివారం పుట్టపర్తి నియోజకవర్గం లోని అన్ని పంచాయతీల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఉదయం 6 గంటలకే స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు, తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు వ్యక్తిగత కారణాలతో హైదరాబాదులో ఉన్నందువల్ల ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారని అందుకు ప్రజలు మన్నించాలని మాజీ మంత్రి కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఒకే రోజులో సుమారు 41648 మంది అర్హులైన లబ్ధిదారులకు 18,23, 57 ,500 కోట్ల రూపాయలు పింఛన్ డబ్బులను ప్రభుత్వం ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతోందని అన్నారు. ఇంత భారీ ఎత్తున నియోజకవర్గంలో ఒకే రోజులో 98 శాతం డబ్బులు మంచి ఒక పండుగ వాతావరణం లో ప్రజలకు ప్రభుత్వ సొమ్ము పంపిణీ కావడం ఒక చరిత్ర అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం లో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయా మండలాల్లోని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సచివాలయ ఉద్యోగులు ,కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ఆయా పంచాయతీల్లో తప్పనిసరిగా హాజరుకావాలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.