బోయిన్ పల్లి మార్కెట్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

బోయిన్ పల్లి మార్కెట్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

 

 

 మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 

 

బోయిన్పల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈరోజు మార్కెట్ కార్యాలయంలో నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .చైర్మన్, వైస్ చైర్మన్ ఆనంద్ బాబు దేవేందర్ లు మరియు డైరెక్టర్ల చేత మార్కెట్ కమిటీ కార్యదర్శి గారు ప్రమాణం చేయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు పాలకమండలి సభ్యులతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు,టీపిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గార్లు నమ్మకంతో మీ మీద ఈ బాధ్యతలు కట్టబెట్టారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మార్కెట్ ను అభివృద్ధి పధం లో నిలపాలని కోరారు.

 

అనంతరం ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడుతూ 

👉 కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ లను రైతులకు మరింత చేరువ చేసి అభివృద్ధి చేయడానికి కంకణబద్దులై పనిచేస్తుంది 

👉 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహోరాత్రులు పనిచేసిన కార్యకర్తలందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గార్లు తప్పకుండా న్యాయం చేస్తారు 

👉పదవులు రానివారు నిరాశకు గురి కావద్దు 

👉 కంటోన్మెంట్ బోర్డు తో సంప్రదించి ప్రతి షాపుకు తాగునీటి సరఫరా చేయడానికి కృషి చేస్తా 

👉 మార్కెట్ కు వచ్చే రైతులకు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్ల నిర్మాణం సాధ్యమైనంత తొందరగా పూర్తి అయ్యేలా చేస్తా 

👉 మార్కెట్ లో నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటా 

ఈ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం లో కంటోన్మెంట్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version