వినుకొండలో ఘనంగా పరిటాల వర్థంతి కార్యక్రమం

వినుకొండలో ఘనంగా పరిటాల వర్థంతి కార్యక్రమం

 

పరిటాలకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మక్కెన, వినుకొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నాగశ్రీను రాయల్.

మాజీమంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం వినుకొండలో ఘనంగా నిర్వహించారు.వినుకొండ విష్ణుకుండినగర్ కాల్వ కట్టపై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెన్నెల సూపర్ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే మక్కెన ప్రారంభించారు. అనంతరం మక్కెన మాట్లాడుతూ పరిటాల రవి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆయన గురించి భవిష్యత్తు తరాలు తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఎన్నో ఉన్నాయన్నారు. వామపక్ష భావాలు కలిగిన శ్రీరాములు కడుపున పుట్టిన రవీంద్ర విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలు ఉన్న గొప్ప నాయకుడు అని కొనియాడారు.

 తెలుగుదేశం పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ్యుడిగా ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆనాడు రాయలసీమ, అనంతపురం ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు‌, వివక్షకు గురవుతున్న అణగారిన వర్గాల కోసం, ఆధిపత్య పోరులో బలహీన వర్గాల వెంటే ఉండి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను ఎదుర్కొని తన ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడు పరిటాల రవీంద్ర అని పేర్కొన్నారు. వినుకొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నాగశ్రీను రాయల్ మాట్లాడు తూ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వెనుకడుగు వేయకుండా ప్రజలు , నమ్ముకున్న వారి కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు పరిటాల రవీంద్ర అంటూ నివాళులు అర్పించారు. ఎన్నికలు కాగానే కార్యకర్తల్ని, నియోజవర్గాన్ని మరిచిపోయే బొల్లా బ్రహ్మనాయుడు వంటి వారు పరిటాల రవీంద్రను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అధికారం ఉంటేనే ఉంటాం లేకుంటే లేదనే నాయకులు మనకు వద్దని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment