శ్రీ మల్లిఖార్జున స్వామి వారి నూతన ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు
ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో శ్రీ మల్లిఖార్జున స్వామి వారి నూతన దేవాలయ నిర్మాణం కోసం సోమవారం తెల్లవారుజామున భూపూజ, శిలాన్యాసం మరియు శంఖుస్థాపనను సతీసమేతంగా చేసి ఆలయ నిర్మాణ పనులను చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో శివపల్లి గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.