వడ్లకొండ కృష్ణ (బంటి) కుల దురహంకార హత్య ను తీవ్రంగా ఖండించిన

వడ్లకొండ కృష్ణ (బంటి) కుల దురహంకార హత్య ను తీవ్రంగా ఖండించిన

 

జాతీయ (యన్. యన్. హెచ్. ఆర్.ఎఫ్ ) మానవ హక్కుల సంఘం కమిటీ సభ్యులు 

 

డా.దుర్గం ప్రభాకర్, డా ముల్లంగి జాకబ్ రాజు 

 

              జాటోత్ డేవిడ్ రాజు 

చార్లెట్ హోం ఆనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు 

 

 

సూర్యాపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రం మామిళ్లగడ్డ వారి నివాసంలో *నేషనల్ నింబిల్ హ్యుమన్ రైట్స్ ఫౌండేషన్* మరియు చార్లెట్ హోం ఆనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు అధ్యక్షులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో నేషనల్ నింబిల్ హ్యుమన్ రైట్స్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు డా. దుర్గం ప్రభాకర్, నేషనల్ నింబిల్ హ్యుమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి డా. ముల్లంగి జాకబ్ రాజు లు కుటుంబాన్ని దర్శించి తన భార్య భార్గవి నీ ఓదార్చారు.డా. దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ నేటి సమాజంలో మానవత్వపు విలువలు దిగజారి పోయి విపరీత ధోరణులు అలంకరించుకోవడం వలన ఇలాంటి దురాగతాలు సంభవిస్తున్నాయి అన్నారు. ఇటీవల గత నెల జనవరి 26న అత్యంత కిరాతకంగా హత్య గావింపబడిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటినీ కుల దురహంకారం తో హత్య చేయడం దుర్మార్గం అనీ హత్య కు పాల్పడిన హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.వడ్లకొండ కృష్ణ సతీమణి భార్గవి తో మాట్లాడగా వారు గత మూడేళ్లుగా ప్రేమించున్నారని వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి కోట్ల భార్గవి 2024 ఆగస్టు 7న నరేకల్ దేవస్థానంలో వివాహం చేసుకున్నామని దీనిని జీర్ణించుకోలేని మా నాయనమ్మ బిక్షమమ్మ సోదరులు నవీన్ వంశీలు గతంలో నా భర్త కృష్ణను హత్య చేయడానికి పలుమార్లు ప్రయత్నించారని, మానవ మృగల్లా కుల దురహంకారం తో అతి కిరాతంగా హత్య చేశారాని, వారిని నేను ఎప్పటికి క్షమించను, చట్టం మీద నాకు నమ్మకం ఉందని వారికీ కఠిన శిక్ష వేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.జిల్లా అధ్యక్షులు జాటోత్ డేవిడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.ఈ సంఘటపై వెంటనే దర్యాప్తు జరిపించి హత్య చేసిన వారిని అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా యస్. పి. మరియు డి. యస్. పి జి. రవి మరియు పోలీస్ శాఖ వారి సేవలు అభినందనీయం అనీ, పోలీస్ ప్రోటక్షన్ ఏర్పటు చేయడం పట్ల హార్షం వ్యక్తం చేశారు అన్నారు.ఈ సందర్బంగా భార్గవి మాట్లాడుతూ నాకు ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించి నన్ను ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో పంది మార్క్, ఏర్పుల క్రిస్టోఫర్, దారావత్ నాగు నాయాక్, మయ్యా నరేష్, మయ్యా శ్వేత, పెరమళ్ళ లింగయ్య తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment