ఒకప్పుడు అరకు లోయకే పరిమితమైన థింసా నృత్యం.. ఇప్పడిప్పుడే జాతీయస్థాయి గుర్తింపు పొందుతున్నది.
అల్లూరి సీతారామ జిల్లా అరకులోయ మండలంలోని మంచు మేఘాలతో సముద్రంలా కనువిందు చేస్తున్న మాడగడ వ్యూ పాయింట్ లో అందమైనా థింసా నృత్యం.
అరకులోయలో ఎంతో ప్రజాదరణ పొందిన గిరిజన నృత్య రూపమైన థింసాను శుభ సందర్భాలు, వివాహ వేడుకల సమయాల్లో ప్రదర్శించడం ఆనవాయితీ.ఇళ్లు, గూడెం వదిలి బయటి ప్రాంతంలో థింసా ప్రదర్శన ఇవ్వడం. సుదూర ప్రాంతాలకు వెళ్లడం మా ఆచారం కాదు. అయితే సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం కోసం కాబట్టి ఎంతో సంతోషంగా ఒప్పుకున్నామని గిరిజన యువతలు చెప్పారు.