విద్య వైద్యానికి , ఉపాధి కై నిధులేవి?

విద్య వైద్యానికి , ఉపాధి కై నిధులేవి?

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ

సామాన్యులకు మళ్లీ మొండి చెయ్యి

సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం

విద్య, వైద్యానికి, ఉపాధికి నిధులు సమకూర్చడంలో, నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సామాన్యులను పట్టించుకున్న పాపాన పోలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం విమర్శించారు. శనివారం రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఆమెకు వరుసగా ఇది 8వసారి. ఈ బడ్జెట్‌లో రైతులు, పేదలు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పెట్టి యువత ను మళ్ళీ మోసం చేశారని, మోడీ గ్యారెంటీ ల్లో ఈ పది సంవత్సరాలు చూస్తే యాడదికి రెండు కోట్ల ఉద్యోగాల చొప్పున 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ కనీసం యువతను మరిచిపోయి కనీసం ఉద్యోగా అవకాశల పై నోరేత్తలేదని, ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన తీరు చూస్తే యువతపై సవతి తల్లి ప్రేమను కనపరుస్తున్నట్టు ఉన్నదని, కేవలం రాజకీయ లబ్ది కోసమే గ్యారెంటీలు ప్రవేశ పెట్టి గద్దెనెక్కారని, కేంద్ర బడ్జెట్ లో కనీసం యువత విమర్శించారు. ఇక పేద ప్రజలకు బడ్జెట్లో ఎలాంటి లాభం లేదని, పేదల నడ్డి విరిచే విధంగా ఉందని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న పట్టించుకున్న పాపాన పోలేదని ఇప్పటికైనా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బిజెపి ప్రభుత్వం పాటుపడాలని హితవు పలికారు.

Join WhatsApp

Join Now

Leave a Comment