నారాయణఖేడ్ మున్సిపాలిటీకి సరిపోయే మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచాలి
మున్సిపల్ కార్మికులపై పని భారం తగ్గించాలి
మున్సిపల్ కార్మికుల హక్కుల సాధనకు సిఐటియు పోరాటం
నారాయణఖేడ్ పట్టణంలో అధిక సంఖ్యలో కొత్త కాలనిలు ఏర్పడ్డావి కావున మున్సిపల్ వర్కర్ ని పెంచుకోవాలని ఈరోజు మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ గారికి సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో అధిక సంఖ్యలో కొత్త కాలనీలో ఏర్పడడంతో పట్టణ మరింత అభివృద్ధి దశలో వెళ్తున్న సందర్భంగా మున్సిపాల్టీలో తక్కువ వర్కర్స్ ఉండడంతో పని భారం పెరగడం వల్ల వర్కర్స్ అనారోగ్య పాలు అవుతున్న పరిస్థితి ఉందన్నారు కావున మున్సిపల్ పట్టణం కు అనుకూలంగా మరో 20 మంది వర్కర్లను నియమించాలని అన్నారు నలుగురు చేయాల్సిన పని ఇద్దరే చేయడంతో ఇబ్బందులు పడుతూ చాలామంది గతంలో పని మాలిన పరిస్థితి ఉందన్నారు వర్కర్లకు నెలవారీగా సబ్బులు సరుపులు అందించాలని సూచించారు పెరిగిన ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచాలని అన్నారు జిల్లాలో అన్ని మున్సిపాలిటీ పరిధిలో భాగంగా ఒక్క పూట పని జరుగుతుందని నారాయణఖేడ్ పట్టణంలో కూడా ఒక్క పూట పని చేపించాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ నెల 10 నుండి ఒక్క పూట పని పెడతామని ప్రతి నెల సరుకులు అందే విధంగా చూస్తామని కమిషనర్ హామీ ఇవ్వడం జరిగింది వర్కర్లకు పని భారం పెంచకుండా వర్కర్ల సంఖ్య పెంచుకోవాలని కోరడంతో వర్గాలను పెంచుకుంటామని ఆయన చెప్పారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు శకుంతల కుమార్ కోశాధికారి సిద్ధమ్మ ఉపాధ్యక్షులు సుధాకర్ ఏసు సుశీల మరియమ్మ బేబీ సాయమ్మ సాయిలు గోపాల్ తదితరులు పాల్గొన్నారు