కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం బడ్జెట్ కేటాయించాలి.

కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం బడ్జెట్ కేటాయించాలి.

 

-ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు భూక్యా రాజేష్.

 

బయ్యారం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూక్యా రాజేష్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో విద్యార్థులకు సరైన విద్య,వసతిగృహాలలో నాణ్యమైన ఆహారం దొరికే పరిస్థితి లేదని ఆర్థిక నిధులలో కేవలం 6% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖకు కేటాయించి తీరని అన్యాయాన్ని చేస్తూ చదువుకునే వారికి విద్యను దూరం చేసే కుట్రని చేస్తున్నాయని మండిపడ్డారు.విద్యాశాఖకు కనీసం 30% నిధులను కేటాయించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా,దేశవ్యాప్తంగా దశలవారీగా రాజీలేని పోరాటాలు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే వరకు ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షుడు వంశీ, గోపి,రాజ్ కుమార్,మురళి ప్రశాంత్,సురేష్,వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment