ఈ నెల 7న లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ఈ నెల 7న లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

 

టిఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ

 

 

ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ మా లక్ష్యం అని జాతి కోసం జాతి బిడ్డలుగా యుద్ధానికి మేము సిద్ధమని టిఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ అన్నారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం ఈ నెల 7న నిర్వహించనున్న లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమ విజయవంతానికై టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు పుట్టల శ్రావణ్ కుమార్ మాదిగ అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పాడని అన్నారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయాలని శాంతియుతంగా ఈనెల 7న నిర్వహించే లక్ష డప్పులు వేల గొంతుల సాంస్కృతిక ప్రదర్శనకు టిఎంఆర్పిఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. ప్రతి మాదిగ సంఘాలకు అతీతంగా మనస్పర్ధలను పక్కకు పెట్టి జాతి అభివృద్ధి కోసం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం ఈనెల 7న నిర్వహించే లక్ష డప్పులు వేల గొంతుల సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతి కోసం జాతి బిడ్డలుగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రతి మాదిగ ఈనెల 7న హైదరాబాద్కు సంకకు డప్పుతో లక్షలాదిగా కదలి రావాలన్నారు. టిఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగడుపుల సూరయ్య మాట్లాడుతూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధనకై నిర్వహించే లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి ప్రతి మాదిగ కదలి రావాలన్నారు. మాదిగ ఉద్యోగులు ఏ స్థాయిలో ఉన్న ప్రతి ఉద్యోగి సెలవు పెట్టి సంకకు డప్పుతో హైదరాబాదుకు తరలివచ్చి మాదిగల సత్తా చాటాలన్నారు. మాదిగలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఫిబ్రవరి 7 లోపు నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దాస్ శంకర్, పట్టణ అధ్యక్షులు పిడమర్తి మధు మాదిగ, ఏం ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మీసాల శివరామకృష్ణ మాదిగ, చివేముల మండల అధ్యక్షులు యడవల్లి రాము, ఆత్మకూర్ ఎస్ మండల అధ్యక్షులు బొల్లె అశోక్, మండల ఉపాధ్యక్షులు సూరారపు నాగయ్య, పెన్ పహాడ్ మండల ప్రధాన కార్యదర్శి కొండేటి సందీప్, బచ్చలకూరి రఘు, నకిరేకంటి వినోద్ మాదిగలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment