తల్లి మృతదేహాన్ని18 కిమీ సైకిల్ పై తీసుకెళ్లిన కొడుకు

తల్లి మృతదేహాన్ని18 కిమీ సైకిల్ పై తీసుకెళ్లిన కొడుకు

 

తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల బాలన్ తన మానసిక అనారోగ్యంతో బాధపడు తున్న తల్లి శివగామి (65) మృతదేహాన్ని సైకిల్‌పై 18 కిమీ తీసుకెళ్లాడు. 

 

గత నాలుగేళ్లుగా శివగామి తన కొడుకు బాలన్‌తో కలిసి సైకిల్‌పై తిరుగుతూ వివిధ ప్రాంతాలకు వెళ్ళేది. కాకపోతే, ఈసారి ఆమె మరణం తరువాత కూడా అతని తల్లిని సైకిల్ పై జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ దృశ్యం ప్రజల హృదయా లను కలిచివేసింది.

 

శివగామి, తిరునల్వేలి జిల్లా నంగునేరి సమీపం లోని మీనావంకులం గ్రామానికి చెందిన మహిళా. ఆమె భర్త జెబామలై చాలా సంవత్సరాల క్రితం మరణించడంతో, శివగామి తన ముగ్గురు కుమారుల తో జీవితాన్ని గడిపింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె మానసిక అనారో గ్యంతో బాధపడుతోంది. 

 

అంతేకాదు, ఆమె చిన్న కుమారుడు బాలన్ కూడా స్వల్ప మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే బాలన్ తన తల్లిని సైకిల్‌పై తీసుకెళ్లి చుట్టూ ఉన్న ప్రాంతాలకు తీసుకె ళ్లడం అనేది అలవాటుగా మారిపోయింది. 

 

ఇక కొద్దిరోజుల క్రితం శివ గామి ఆరోగ్యం క్షీణించడం తో, బాలన్ ఆమెను తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి చేర్పిం చాడు. కానీ, గురువారం సాయంత్రం శివగామి మృతదేహాన్ని గుడ్డతో కట్టి తీసుకెళ్లుతున్న దృశ్యాన్ని చూసిన వారు, ముండ్రడైపు పోలీస్ స్టేషన్‌కు సమాచా రం అందించారు. 

 

ఈ ఘటనపై పోలీసు అధికారులు వెంటనే స్పందించి, బాలన్‌ను అదుపులోకి తీసుకొని శివగామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం దాన్ని తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. 

 

అయితే, కొన్ని మీడియా వర్గాలు శివగామి ఆసుప త్రిలో చనిపోలేదని, ఆసు పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలా జరిగిందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తిరున ల్వేలి ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రి హెడ్, డా. రేవతి, బాలన్‌పై తీవ్రమైన ఆరోపణలు మోపారు. 

 

ఆమె మాట్లాడుతూ.., ఆసుపత్రిలో శివగామి చనిపోలేదని.. బాలన్ తల్లి చికిత్సకు సహకరించలేదని తెలిపారు. సిబ్బందికి తెలియకుండా తన తల్లిని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లా డని వివరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment