అంబులెన్స్ ను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
మంత్రి చొరవతో 108 అంబులెన్స్
మండల ప్రజల తరపున మంత్రిగారికి కృతజ్ఞతలు
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో 108 అంబులెన్స్ కుయ్..కుయ్ మంటూ మోగనుంది. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ జోషి, యూత్ అధ్యక్షుడు వెంకట్రావు, మండల నాయకులచే జెండా ఊపి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత యేడాదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వట్పల్లి మండల ప్రజలు పడుతున్న ఇబ్బందులను మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ జోషి, మండల నాయకులు మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ దృష్టికి తీసుకెళ్లి మండలానికి 108 అంబులెన్ను ఏర్పాటు చేయాలని కోరగా స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దీంతో మండల ప్రజల కళ నెరవేరిందన్నారు. మండల ప్రజల తరపున మంత్రిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పత్రి విఠల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈశ్వరయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టల్లు దిగంబరావ్, నాగయ్య, హబీబ్ మియా, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సంగారెడ్డి, నాయకులు పెద్దన్న, ప్రశాంత్, అశోక్, నాగరాజు, వీరారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.