మొదటిసారి రికార్డ్‌స్థాయికి చేరుకున్న బంగారం ధర
రూ.83,000 మార్క్ దాటిన బంగారం ధర
99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధరలో రూ.200 పెరుగుదల
రూ.500 పెరిగి రూ.93,500 చేరుకున్న కిలో వెండి
బంగారం ధర పరుగు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి పెరిగిన నేపథ్యంలో పెట్టుబడిదారులు పసిడి వైపు చూస్తున్నారు. దీంతో బంగారం ధర భారీగా పెరిగింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.83 వేలు దాటింది. బంగారం రూ.83 వేల మార్క్ దాటడం ఇదే మొదటిసారి.99.9 స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.200 పెరిగి రూ.83,100కి చేరుకుందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.200 పెరిగి రూ.82,700కు చేరుకుంది.వెండి కిలో రూ.500 పెరిగి రూ.93,500కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2,780 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి 31.32 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది