పేటలో డప్పుల ప్రదర్శన ర్యాలీ.
పెద్ద శంకరంపేట్. ఈనెల 7వ తేదీన హైదరాబాదులో నిర్వహించే లక్ష డప్పుల ప్రదర్శనకు పెద్ద శంకరంపేటలో శుక్రవారం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 100 డప్పుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. పెద్ద శంకరంపేట మండలం తరపున లక్ష డప్పుల ప్రదర్శన కోసం సంఘీభావం తెలుపుతున్నామన్నారు.కాగా ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు జంగం శ్రీనివాస్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయిని మధు తదితరులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాందేడ్ దుర్గయ్య. మండల అధ్యక్షుడు రోమాల సాయిలు. బాధ్యులు.మాణిక్యం సంగయ్య తుకారాం నాగరాజు సురేష్ పాండు బేతయ్య కిష్టయ్య ఆయా గ్రామాల బాధ్యులు డప్పుల ప్రదర్శనలో పాల్గొన్నారు .