షేక్ సాహెబ్ దర్గాకు దారి లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు…..

షేక్ సాహెబ్ దర్గాకు దారి లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు………

 

  వికారాబాద్ జిల్లాకొడంగల్ పట్టణ శివారులోని కోస్గి రోడ్డు లో గల షేక్ సాహబ్ దర్గా కు దారి లేక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని మైనారిటీ నాయకులు ఎస్ఎం. గౌసన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ విజయ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. సర్వే నెం.888, 889 లో వెనక భాగంలో దర్గా కు దారి ఉండేదాని, కానీ ఇటీవలే దర్గా సమీపంలో ఓ వ్యక్తి భూమిని కొనుగోలు చేసి దర్గా కు వెళ్లే దారిని బంద్ చేశారని తెలిపారు. సర్వే చేసి దర్గా కు వెళ్లేందుకు దారి కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు రెండు రోజుల్లో అట్టి సర్వే నెం.లలో సర్వే చేయిస్తామని తహసీల్దార్ తెలిపినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కరీం, డాక్టర్ హాదీ, సయ్యద్ ఖైరత్ లీ ఖాద్రి, ఎండీ. ఖాసీం, షబ్బీర్ అలీ, అహ్మద్ ఖాన్, సయ్యద్ ఇసక్ పాషా, జాహేద్ హుసేన్, వాహేద్ రజ, అబ్దుల్ సత్తార్, అబ్దుల్ ఖాదర్, నిసారుల్లా ఖాన్, సయ్యద్ అబ్దుల్ రహేమాన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version