ఆన్లైన్ డేటా నమోదు ప్రక్రియ ఎంతో కీలకం

ఆన్లైన్ డేటా నమోదు ప్రక్రియ ఎంతో కీలకం

 

…జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

 

శుక్రవారం, జిల్లాలోని హవేలీ ఘన్పూర్ మండలం రైతు వేదికలో డాటా ఎంట్రీ కొనసాగుతోన్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే పరిశీలన అభ్యంతరాల దరఖాస్తుల ఆన్లైన్ డేటా నమోదు తీరును *జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

 

ఈ సందర్భంగా గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తు వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని, అర్హులకు ఈ సంక్షేమ పథకాలను అందించేందుకు గాను సదరు దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేయడం ఎంతో కీలకమని, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వివరాలను ఆన్లైన్ లో సంక్షిప్తం చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని తెలిపారు.

 

అనంతరం స్థానిక డైట్ కాలేజీ లో తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ఏర్పాటును పరిశీలించారు.ఈ పరిశీలనలో ఎంపీడీవో రవిశ్వర్ గౌడ్, తహసీల్దార్ సింధు రేణుక ,సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment