శ్రీ సాంబశివ సాంబమూర్తి ఆలయ నూతన కమిటీ ఎన్నిక
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామంలోని శ్రీ సాంబశివ సాంబమూర్తి దేవాలయం నూతన కమిటీని గ్రామ పెద్దలు కుల సంఘాల సభ్యులు, యువకులు, మహిళలతో కూడిన కమిటీని ఎన్నుకునుటకై తేదీ 30 -01-2025 గురువారం రోజున సమావేశం జరిగింది. అందరి అభిప్రాయం మేరకు రెండు సంవత్సరాల కార్యక్రమాలు నిర్వహించుటకై కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, భోజ్జపురి అశోక్ ముఖర్జీ, కోడూరి సరోజన, వంగ రవి,అధ్యక్షులుగా గన్ను శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా దాన శ్రీనివాస్, ఆదరి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా కొడకండ్ల సుదర్శన్ రెడ్డి, కోశాధికారిగా ఎదులాపురం తిరుపతి కమిటీ మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా పనిచేస్తామని అధ్యక్షులు తెలిపారు. ఈ కమిటీ ద్వారా ఆలయంలో భక్తులకు కావాల్సిన సౌకర్యాలు, వేడుకలు ఇంకా అన్ని రకాల పనులు జరుగుతాయని అర్చకులు తుమ్మల మధుకర్ తెలియజేశారు.